Sunday, December 15, 2024

దిల్ రాజు పెద్ద ప్లానే.. యుఎస్‌లో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

- Advertisement -
- Advertisement -

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను ఎస్‌విసి, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.

డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముందస్తు వేడుకకు వేదిక కానుండటం విశేషం. చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరుకాబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News