Tuesday, May 7, 2024

బర్త్ డే పార్టీ… మైనర్ పై గ్యాంగ్ రేప్… గన్ తో కాల్చి

- Advertisement -
- Advertisement -

Gang rape on minor girl in pune

పుణే: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను తుపాకీతో కాల్చిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పుణేలనోని శకర్ నగర్ ప్రాంతంలో ఉంటుంది. బాలిక తన ఫ్రెండ్ బర్త్ డే ఉండడంతో వార్జే మాల్వాడీ ప్రాంతానికి వెళ్లింది. పుట్టిన రోజులు వేడుకలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లడానికి వీలుకాలేదు. ముగ్గురు వ్యక్తులు ఆమెను ఒక రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పతుండగా వారి నుంచి తప్పించుకుంది. ఒకడు గన్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె చాతీభాగంలో తగిలింది. అక్కడే ఫోన్ ఉండడంతో ఆమె గాయపడలేదు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి పడిపోవడంతో ఆమెను స్థానికు ఆస్పత్రికి స్నేహితురాలు తరలించింది. ఆమెకు చిన్నపాటి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News