Thursday, May 2, 2024

అద్దెకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మహిళపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Gang rape on women

 

హైదరాబాద్: అద్దెకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఇంట్లో తీసుకెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ(28) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. ఇళ్లలో పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. ఆమెకు రఫీక్ అనే వ్యక్తి పరిచయం కావడంతో ఇల్లు ఇప్పిస్తానని షాహిన్ నగర్ కు తీసుకెళ్లాడు. పాతనగరం తీసుకెళ్లిన తరువాత మహిళపై రఫీక్ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అనంతరం వీడియోలు, ఫోటోలు కూడా తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేశాడు. ఈ ఘటనపై వారం రోజుల నుంచి బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితురాలు ఆరోపణలు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News