Thursday, May 2, 2024

గంగవ్వకు బంపర్ ఆఫర్..!

- Advertisement -
- Advertisement -

Gangavva as play chiru's mother in 'God Father'

హైదరాబాద్: యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరించిన గంగవ్వ.. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని మరింత దగ్గరైంది. ఇప్పటికే పలు సినిమాలో నటించిన గంగవ్వ మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ దాదాపు 60ఏళ్ల వయసులోనూ జోరు చూపిస్తున్న గంగవ్వ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. గంగవ్వ, మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా నటిస్తున్నట్లు ఫిలీం సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాద‌ర్’ చిత్రంలో గంగవ్వ, చిరు తల్లి పాత్ర చేస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఊటీలో జరుగుతుంది. మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, చిరు చెల్లెలిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Gangavva as play chiru’s mother in ‘God Father’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News