Thursday, August 7, 2025

విశాఖలో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. హిమాలయ బార్ దగ్గర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా సిబ్బంది వెల్డింగ్ పని చేస్తుండగా.. ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టని విధంగా మారిపోయాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం విశాఖ కెజిహెచ్‌కి తరలించారు. బాధితులను నగర సిపి శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News