Saturday, April 27, 2024

అయోధ్య రామాలయానికి అద్భుతమైన కానుకలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జనవరి 22న అయోధ్య లోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి అద్భుతమైన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. వీటిలో కొన్ని రామాయణ ఇతిహాసంలో పేర్కొన్న ప్రదేశాల నుంచి ఆనవాలుగా కొన్ని కానుకలు వస్తుండటం విశేషం. 108 అడుగుల పొడవైన ధూపం స్టిక్, 2100 కిలోల బరువున్న గంట, 1100 కిలోల బరువున్న భారీ దీపం, బంగారు పాదుకలు, 10 అడుగుల పొడవున్న తాళం చెవి, ఎనిమిది దేశాల సమయాన్ని ఏక కాలంలో ఒకేసారి చూపించగలిగే గడియారం, తదితర ప్రత్యేక అద్భుత బహుమతుల్లో కొన్ని శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠకు ముందే చేరుకున్నాయి.

ఈ అపురూప కానుకలు తయారు చేసిన విశిష్ట కళాకారులు, ఇవి శ్రీరామాలయంలో ఉపయోగపడగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీత జన్మభూమిగా పేరొందిన నేపాల్ లోని జనక్‌పురి నుంచి 3000 కు మించి కానుకలు అయోధ్యకు చేరాయి. వీటిలో వెండి పాదుకలు, ఆభరణాలు, వస్త్రాలు ఉన్నాయి. నేపాల్ లోని జనక్‌పుర్ ధామ్ రామజానకి ఆలయం నుంచి 30 వాహనాల ద్వారా అయోధ్యకు ఈ వారం వచ్చాయి. శ్రీలంక లోని అశోక్‌వాటిక నుంచి కూడా ప్రత్యేక బహుమతులతో ప్రతినిధి బృందం అయోధ్యకు తరలి వచ్చింది. లంకలో రావణుని నిర్బంధంలో సీత ఉన్న అశోక వనం నుంచి ఒక శిలను అయోధ్యకు తీసుకువచ్చారు.

40 రోజుల పాటు వెలిగే పరిమళ ధూపం
108 అడుగుల పొడవుతో 3.5 అడుగుల వెడల్పుతో 3610 కిలోల బరువున్న ధూపం స్టిక్‌ను గుజరాత్ లోని వడోదరలో ఆర్నెలల పాటు తయారు చేశారు. ఈ ధూపం 40 రోజుల పాటు అనేక కిలోమీటర్ల దూరం సుగంధాన్ని విరజిమ్ముతుంది. ఇది పర్యావరణ హితంగా ఉంటుందని దీన్ని తయారు చేసిన వడోదర కళాకారుడు విహభర్వాద్ చెప్పారు. ఈ ధూపం స్టిక్‌ను తయారు చేయడానికి 378 కిలోల గుగ్గిలం, 376 కిలోల కొబ్బరి చిప్పలు, 190 కిలోల నెయ్యి, 1470 కిలోల ఆవు పేడ, 420 కిలోల మూలికలు ఉపయోగించామని ఆయన వివరించారు. ఢిల్లీ లోని కుతుబ్‌మీనార్ పొడవులో సగం దీని పొడవు ఉంటుందన్నారు. భర్వాద్ మరో 25 మంది ఈ భారీ ధూపం స్టిక్‌ను తీసుకుని కాన్వాయ్‌తో జనవరి 1న బయలుదేరి 18న అయోధ్యకు చేరుకున్నారు.
శ్రీరామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గత వారం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లో 44 అడుగుల పొడవైన ఇత్తడి పతాక స్తంభాన్ని మరో ఆరు చిన్న పతాకస్తంభాలను కూడా ఆవిష్కరించారు
2100 కిలోల గంట
2100 కిలోల బరువున్న గంట ఎనిమిది లోహాలతో (అష్టధాతు)ఉత్తరప్రదేశ్‌లో ఈటాకు చెందిన జలేశార్ తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి రెండేళ్ల పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News