దేశంలోని మొట్టమొదటి సాంకేతిక ఆధారిత ఓమ్ని-ఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ (కాస్మో ఫస్ట్ లిమిటెడ్), విజయవంతంగా తమ ‘ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే’ (IHPD 2025) రెండవ ఎడిషన్‌ను వైభవంగా జరుపుకుంది. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో 2200 కి పైగా పెంపుడు జంతువులు, పెట్ పేరెంట్స్ పాల్గొన్నారు. గత సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమం సాధించిన అద్భుతమైన విజయం ఇచ్చిన స్పూర్తితో, ఫ్రెండ్‌షిప్ డే నాడు నిర్వహించిన ఈ ఉత్సవం, పెంపుడు జంతువుల తల్లిదండ్రులు, వారి ముద్దుల స్నేహితుల మధ్య ప్రత్యేక బంధాన్ని వేడుక జరుపుకుంది, అదే సమయంలో బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల పెంపకాన్ని ప్రోత్సహించింది.
జిగ్లీ యొక్క ‘ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే’ (IHPD) వేడుకలో పెంపుడు జంతువులు , పెంపుడు జంతువుల తల్లిదండ్రులను ఆనందపరిచేందుకు అనేక కార్యకలాపాలు నిర్వహించారు. ఈ వేడుకలు చిరస్మరణీయమైన క్షణాలను సృష్టించాయి. ఈ వేడుకలలో భాగంగా ‘జిగ్లీ కాయిన్స్’ను జిగ్లీ ప్రారంభించింది. వినియోగదారులు జిగ్లీ వద్ద చేసే రూ. 100 ఖర్చుపై ఒక నాణెం సంపాదించవచ్చు, ప్రతి నాణెం రూ.1 విలువ కలిగి ఉంటుంది. ఇది తమ ఫర్ స్నేహితుల కోసం వినియోగదారుల చేసే కొనుగోలుకు విలువను జోడిస్తుంది. ఈ వేడుకలలో భాగంగానే ఇన్-హౌస్ అప్లాడ్ బ్రాండ్ ద్వారా దంత పరిశుభ్రత కోసం వెట్ ఫుడ్ & ఫ్రెష్ ఫుడ్ మరియు యాక్ చ్యూస్, జిగ్లీ లైఫ్‌స్టైల్‌లో ట్రావెల్ మ్యాట్, కుక్కలు మరియు పిల్లుల కోసం ఫర్ ప్రో శ్రేణిలో క్యాట్ లిట్టర్ మరియు గ్రూమింగ్ టూల్స్ కోసం కొత్త బ్రాండ్ క్యాట్‌మోస్ వంటి ప్రత్యేకమైన పెంపుడు జంతువుల ఉత్పత్తులను సైతం విడుదల చేశారు.
IHPD రెండవ సంవత్సర వేడుకల సందర్భంగా కాస్మో ఫస్ట్ గ్రూప్ సీఈఓ శ్రీ పంకజ్ పొద్దార్ మాట్లాడుతూ.. “మా రెండవ అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డేకి లభించిన అపూర్వమైన స్పందన భారతదేశపు పెంపుడు జంతువుల సమాజానికి అర్థవంతమైన అనుభవాలను సృష్టించాలనే మా లక్ష్యంను ధృవీకరిస్తుంది. మా అన్ని కేంద్రాలలో మేము చూసిన ఉత్సాహం, భాగస్వామ్యం, పెంపుడు జంతువు తల్లిదండ్రులు, విలువైన సేవలు, కమ్యూనిటీ కనెక్షన్లు, కొత్త పెంపుడు జంతువుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే సురక్షితమైన ప్రాంగణాలను వెతుకుతున్నారనే మా నమ్మకాన్ని బలోపేతం చేసింది . ఈ విజయం భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పర్యావరణ వ్యవస్థ కోసం మా ఆఫర్‌లను కొనసాగించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది” అని అన్నారు. ఇంటరాక్టివ్ గేమ్‌లు, పజిల్స్ మరియు ఉచిత విందులు ఉత్సాహాన్ని నింపాయి, పెంపుడు జంతువుల ఫ్యాషన్ షో ప్రధానంగా జనాలను ఆకర్షించింది.