Wednesday, May 15, 2024

కోవాగ్జిన్ రెండో దశ ప్రయోగాల వివరాలు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Give details of Covaxin second phase experiments : DGCA

 

భారత్ బయోటెక్‌కు డిజిసిఐ ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఫార్మాదిగ్గజం భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ)ని కోరింది. అయితే మూడో దశ ప్రయోగాలు చేపట్టే ముందు రెండో దశ ప్రయోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని డిజిసిఐ భారత్ బయోటెక్‌ను కోరింది. కోవాగ్జిన్ మూడో దశ రాండమైజ్డ్ డబుల్ బ్లైండ్ ప్లాసెబో కంట్రోల్డ్ మల్టీసెంటర్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు భారత్ బయోటెక్ ఈ నెల 2న డిజిసిఐకి దరఖాస్తు చేసుకుంది. మూడో దశ ప్రోటోకాల్‌ను కూడా సమర్పించింది. దీంతో పాటుగా మొదటి దశ, రెండో దశ మధ్యంతర ఫలితాల డేటాను కూడా జతచేసింది. ఈదరఖాస్తుపై డిజిసిఐ ఈ నెల 5న పరిశీలనలు జరిపింది.

అయితే మూడో దశ ప్రయోగాలపై డిజిసిఐ నిపుణుల కమిటీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. రెండో దశ ప్రయోగాలపై కొంత స్పష్టత రావలసి ఉందని పేర్కొంది. ఇందుకోసం రెండో దశ ట్రయల్స్‌కు సంబంధించి భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను ఇవ్వమని కోరింది. మరోవైపు వ్యాక్సిన్ ప్రయోగాల్లో కోవాగ్జిన్ అన్ని వయసులవారిలోను మెరుగ్గా పని చేస్తోందని, ఇప్పటివరకు ఎలాంటి హానికర దుష్ప్రభావాలు రాలేదని నిపుణు కమిటీ గుర్తించినట్లు డిజిసిఐ వర్గాల సమాచారం. కేవలం ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి మాత్రం కాస్సేపు ఉంటుందని ప్రయోగాల్లో తేలినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News