Monday, April 29, 2024

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో చర్చ రద్దు

- Advertisement -
- Advertisement -
Second US presidential debate cancelled
అధికారికంగా ప్రకటించిన సిపిడి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య అక్టోబర్ 15న మియామీ, ఫ్లోరిడాల్లో జరగాల్సిన ప్రత్యక్ష ముఖాముఖి చర్చ రద్దు అయింది. ఇక తదుపరి అక్టోబర్ 22న జరగాల్సిన తుది ముఖాముఖి పై దృష్టి కేంద్రీకరించినట్టు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సిపిడి) అధికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన ట్రంప్ ప్రస్తుతం చికిత్స పూర్తి చేసుకుని శనివారం నుంచి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమౌతున్నారు. అయితే చర్చలో పాల్గొనే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండో ముఖాముఖి చర్చను వర్చువల్‌గా నిర్వహించాలని సిపిడి నిర్ణయించడంపై ఇద్దరు అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వర్చువల్ ముఖాముఖికి ట్రంప్ ఒప్పుకోలేదు. మరోవైపు ట్రంప్‌తో ప్రత్యక్షంగా చర్చలో పాల్గొనడానికి బిడెన్ కూడా అంగీకరించలేదు. దీంతో ఇద్దరు అభ్యర్థులు 15న జరగాల్సిన చర్చకు బదులు వేరే కార్యక్రమాలను నిర్ణయించుకున్నారు. అయితే ఈనెల 22న తుది చర్చలో పాల్గొనడానికి మాత్రం ఇద్దరూ అంగీకరించినట్టు సిడిపి తెలియచేసింది. మొదటి చర్చ సెప్టెంబర్ 29న ఇద్దరి మధ్య క్లీవ్‌లాండ్, ఒహియోలో జరిగింది. అలాగే అక్టోబర్ 7న ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలాహారిస్ మధ్య చర్చ జరిగింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ప్రత్యక్ష చర్చలో పాల్గొనడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు జరిగే ఈ చర్చను సిపిడి మూడు సార్లు నిర్వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News