Thursday, May 2, 2024

పిల్లలు పుడుతారని మహిళలతో కలిసి పవిత్ర స్నానం… బాబా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

God man rape on women in Bihar

పాట్నా: తనతో కలిసి పవిత్ర స్నానం చేస్తే పిల్లలు పుడుతారని చెప్పి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న బాబాను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన బీహార్‌లోని వైశాలి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి తనకు తాను బాబాను అని, తన మాయమాటాలతో మహిళలను నమ్మించి పిల్లలు పుట్టిస్తానని చెప్పేవాడు. బాబా మాటలు నమ్మి కొందరు మోసపోయారు. ఓ మహిళ పిల్లలు పుట్టడం లేదని బాబాను కలిసింది. తనతో పవిత్ర స్నానం చేస్తే పిల్లలు పుడుతారని సదరు మహిళను నమ్మించాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన తరువాత మహిళపై బాబా అత్యాచారం చేశాడు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాబాను అరెస్టు చేశారు. బాధితులు ఒక్కొక్కరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News