Sunday, April 28, 2024

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాష్ట్రంలో అధిక వర్షాలు నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరికి ప్రాణహితకు అనుకొని ఉన్నా పిల్ల వాగు పొంగి ప్రవహించడంతో గోదావరి ప్రాణహిత నదుల నుండి అధికంగా నీరు వచ్చి చేరడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత అన్నారం వద్ద భారీ బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రాణహిత నదులు కలిసి కాళేశ్వరం వద్ద 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం ప్రవహిస్తున్నట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలకు భారీగా వరద నీరు చేరడంతో ఎంతో బ్యారేజి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

దానికి అన్నారం బ్యారేజీ వద్ద 65 గేట్ల గాను 58 గేట్లు ఎత్తి వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 7లక్షల 76 వేల క్యూసెక్కుల ఉండగా గోదావరి నది నుంచి 5 లక్షల 40వేల క్యూసెక్కులు, మానేరు నుంచి 22 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద నీరు అన్నారం బ్యారేజ్ కి వచ్చి చేరుతుంది. ఇది ఇలా ఉండగా గేట్లు ఎత్తి 7 లక్షల 76 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఇటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు మెడిగడ్డ బ్యారేజ్ వద్దకు భారీగా వరద ప్రవాహం చేరుకుంది. మరోవైపు అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో సుమారు మేడిగడ్డ బ్యారేజ్ కి 6లక్షల 86 క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా 64 గేట్లు ఎత్తి మళ్లీ 6 లక్ష 86 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజీ వద్ద నాలుగు టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నారం గేట్లు ఎత్తివేయడంతో ని అన్నారం చంద్రవెల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో టి బ్యాక్ వాటర్ చంద్రప,ల్లి నాగపల్లి, మద్దులపల్లి లోని పంట పొలాలు నష్టపోయాయి. సుమారు 100 ఎకరాలు నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముప్పుకు గురైన ప్రాంతాలను కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహాన్ని మాదాపూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ ఎంపీడీవో శంకర్ తదితరులు సందర్శించారు. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి నదిని చూసేందుకు వచ్చే భక్తులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. అదే చిన్న చిన్న దుకాణాలను బంద్ చేయాలని వ్యాపారులకు అధికారులు తెలిపారు. గోదావరి ప్రవాహం పెరుగుతుంది కావున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు లోతట్టు ప్రాంతాలకు ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News