Monday, November 4, 2024

పరుగో పరుగు.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

పసిడి కొనుగోలు దారులకు మరోసారి షాకిచ్చాయి బంగారం ధరలు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు మరోసారి పెరిగాయి. దీంతో మార్కెట్ లో తులం గోల్డ్ రూ.78వేలకు చేరువైంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముగల(తులం) బంగారం ధర రూ.450 పెరిగి రూ.71,400కు చేరుకుంది.ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి రూ.77,890గా కొనసాగుతోంది. అయితే, కేజీ వెండిపై రూ.100 తగ్గింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,800గా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News