Tuesday, May 14, 2024

గూడ్స్ వాహనాలపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Goods vehicles are allowed from 9pm to 8am

ఉత్తర్వులు జారీ చేసిన ముగ్గురు సిపిలు

మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, విసి సజ్జనార్, మహేష్ భగవత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు గూడ్స్ వాహనాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో చాలా వాహనాలు లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాల వస్తువుల పేరుతో బయటికి వస్తున్నారు. దీంతో గూడ్స్ వాహనాలు కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఉదయం 10గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిత్యావసర వస్తువులు తీసుకుని వచ్చే గూడ్స్ వాహనాలకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేశారు. కాని కొన్ని వాటికి మినహాయింపు ఇచ్చారు. ఆక్సిజన్, గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల వాహనాలు, ఆక్సిజన్ ట్యాంకర్లు, మెడికల్ సామాగ్రి తీసుకుని వచ్చే వాహనాలు, డ్రింకింగ్ వాటర్ తీసుకుని వచ్చే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. అంతరాష్ట్ర వాహనాలు ఓఆర్‌ఆర్ నుంచి వెళ్లాల్సి ఉంటుందని, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News