Thursday, May 2, 2024

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వము విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఏకరూప వస్త్రాలతోపాటు ఉచితంగా పుస్తకాలను అందిస్తూ సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను స్థాపించి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతిని కల్పిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. గుండ్లపోచంపల్లి పాఠశాలలో డిజిటల్ క్లాసులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు రాగి జావాను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయకుమారి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News