Thursday, May 2, 2024

ఏడాదికి 15 రోజులు ఇంటినుంచే పని

- Advertisement -
- Advertisement -

work-from-home

 అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ ఆమలు
ముసాయిదాలో ప్రతిపాదించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఇకపై ప్రభుత్వ అధికారులు ఏడాదికి 15 రోజులు ఇంటినుంచి పని చేసేలా సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డిఓపిటి) ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ కాలంలో వచ్చిన మార్పులను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తం గా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో పనులు ఆగిపోకుండా ఉండడానికి ప్రభుత్వం ఉద్యోగులకు ఇంటినుంచే పని చేసే వీలు కల్పించింది. ఇకపైనా దాన్ని పరిమిత స్థాయిలో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర సచివాలయంలో భౌతిక దూరం అమ లు చేసేందుకు ఇకపై హాజరు, పని గంటలులో మార్పులు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకార్యాలయం(ఇఆఫీస్)ను అమలు చేయాలని డిఓపిటి ప్రతిపాదించింది. ఇప్పటికే 57 ప్రభు త్వ శాఖలు 80 శాతం పనిని ఇఆఫీసులోనే చేస్తుండడం గమనార్హం. ‘కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా చాలా మంత్రిత్వశాఖలు, విభాగాలు ఇఆషీస్‌నువీడియో కాన్ఫరెన్సింగ్ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించుకోవడంద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించాయి.

భారత ప్రభుత్వంలో ఇలాంటి అనుభవం ఇదే మొదటిసారి’ అని ఆ ముసాయిదా పేర్కొంది. అందువల్ల లాక్‌డౌన్ తర్వాతి పరిస్థితుల్లో కూడా ఇంటినుంచి పని చేయడాన్ని కొనసాగించడానికి సమాచార భద్రత ఉండేలా చూ డడం కోసం స్పష్టమైన నిబంధనావళి ఉండడం అవసరమని భావిస్తున్నట్లు ఆ ముసాయిదాలో పేర్కొన్నారు. ఇకపై ఈ విధానాన్ని కొనసాగించేందుకు సెక్షన్ అధికారి స్థాయి వ్యక్తులకు విపిఎస్ యాక్సెస్ ఇవ్వాలని డిఓపిటి ప్రతిపాదించింది.

ఇప్పటివరకు ఈ అధికారం డిప్యూటీ సెక్రటరీ,ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ఉంది. భద్ర తాపరమైన ఇబ్బందులను తొలగించేందుకు వర్గీకరించిన ఫైళ్లను ఇంటర్నెట్‌నుంచి యాక్సెస్ చేయకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఫైళ్లను చూపే వారికి ఇంటినుంచి పని చేసే సౌకర్యం ఉం డదని డిఓపిటి స్పష్టం చేసింది.ఇంటివద్దనుంచే పని చేసేందుకు ఉద్యోగులకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను సమకూర్చనున్నట్లు తెలుస్తోంది.

ఎవరైతే ఇంటినుంచి పని సౌకర్యా న్ని ఉపయోగించుకుంటారో వారికి ఈ ల్యాప్‌టాప్‌లను ఇస్తారు. పార్లమెంటు సంబంధిత, విఐపి ప్రశ్నల ఫైళ్లను ప్రాసెస్ చేసే వారికి ఎస్‌ఎంఎస్ వ్యవస్థను తీసుకు రావాలని డిఓపిటి ప్రతిపాదించింది.అలాగే సమావేశాలకోసం ఎన్‌ఐసి వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఉపయోగించుకోవాలని సూచించింది. ‘ఇంటినుంచి పనిచేసే అధి కారులు ఫోన్లో అందుబాటులో ఉంటారు. వారి కంప్యూటర్, ఎలక్ట్రానికి పరికరాలను మాల్‌వేర్‌ల నుంచి రక్షించే బాధ్యతను ఎన్‌ఐసి తీసుకొంటుంది’ అని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News