Sunday, April 28, 2024

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ నర్సింలు, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

షాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ నర్సింలు, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మెకు వారు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయలన్నారు. వేతనాలకు ప్రభుత ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్‌లను సహాయక కార్యదర్శులుగా నియమించాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని రూ. 5లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీలలో ఆదాయమున్న చోట వేతనాల పెంపుకు అనుమతివ్వాలన్నారు.

సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవాలి, వాటిని నగదు రూపంలో అలవెన్స్‌గా చెల్లించాలన్నారు. కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని అన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు భీమయ్య, ఆయా గ్రామ పంచాయతీల కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News