Sunday, April 28, 2024

ఘనంగా బక్రీద్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: డివిజన్ వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సంపేటలోని జామె మసీదులో మౌళానా మహబూబురహమాన్, ఫాతిమా మసీదులో ముఫ్తీ జావిద్ హుస్సేన్, మసీదే మతీన్‌లో ముఫ్తీ గౌసోద్దీన్, గౌసియా మసీదులో ఖారీ ఇర్ఫాన్, మదీన, తాజ్ ఖుర్షీద్ మసీదులో ఈద్ ఉల్ అజా ప్రత్యేక నమాజ్ చదివారు. త్యాగాల ప్రతీక జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా మాంసం దానం చేస్తారు.

అలాగే కబరుస్థాన్‌లో చనిపోయిన బంధు మిత్రుల సమాధులపై పూలు వేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ వేడుకల్లో అన్వర్ షేక్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, జామె మసీదు కమిటీ అధ్యక్షుడు నబీ, హబీబ్, అయ్యుబ్‌ఖాన్, అజీజ్, జావిద్, మండల కోఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, నాయబ్ రసూల్, హుస్సేన్, సిరాజ్, ఖాదర్, కరీమ్, సిరాజ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

* ఖిలా వరంగల్‌లో.. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఖిలా వరంగల్, మట్టెవాడ, చింతల్, ఎల్‌బీ నగర్‌లోని ఈద్గాలను సందర్శించి నమాజ్ చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం తూర్పు నియోజకవర్గమని, ఈ నియోజకవర్గంలో అందరం కలిసిమెలిసి ఉంటారని మైనార్టీలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ వెన్నంటి ఉంటామన్నారు.

ఈద్గాలు, మసీదులను అభివృద్ధి చేస్తున్నామని, మైనార్టీల సమస్యలను తీర్చడంలో ముందుంటామన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో షాదీఖాన పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

* ఖానాపురంలో.. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మండలంలోని బుధరావుపేట గ్రామంలో మసీదులో జరిగిన ప్రత్యేక నమాజ్‌లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో ఆత్మీయంగా అలాయి బలాయి ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మివెంకటనర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ, సర్పంచ్, క్లస్టర్ బాధ్యులు, నాయకులు, ముస్లిం మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News