Tuesday, April 30, 2024

గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎపి ఎంఎల్ఎలు

- Advertisement -
- Advertisement -

Green India Challenge

 

హైదరాబాద్ ః రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు రోజురోజుకు అపూర్వ స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తెలియపర్చే విధంగా ఉందంటూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. అంతేస్థాయిలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కలు నాటి పర్యావరణ కాపాడాలన్న స్పృహ ప్రతి ఒక్కరిలోనూ ఇనుమడిస్తోంది.

అంతేకాదు, తాము మొక్కలు నాటడమే కాకుండా పది మందికి ఈ విషయాన్ని తెలియపరుస్తూ వారిని గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వాములను చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ విధిగా భాగస్వాములవుతూ పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రతిన బూనుతున్నారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యత మాదేనని చెబుతున్నారు.

కాలుష్య నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి ః ఎంఎల్‌ఎ పెట్ల ఉమాశంకర్ గణేష్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పెద్దబొడ్డేపల్లి గ్రామంలో, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో నర్సీపట్నం నియోజకవర్గం ఎంఎల్‌ఎ పెట్ల ఉమాశంకర్ గణేష్ మూడు మొక్కలు నాటారు. మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా గణేష మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రోజాకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణపైన ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని, భాగస్వాములై మొక్కలు నాటాలి.

మానవాళికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపయోగపడే పక్షులు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో గూడుకట్టుకుని ఉండేవి ఇప్పుడు వాటికి చెట్లు లేకపోవడం వల్ల పక్షులకు నివాసయోగ్యంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. మన వంతుగా మనం మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మన గ్రామాల్లో కానీ వీలున్నంతగా పండ్ల మొక్కలు జనాలకు ఉపయోగపడే చెట్లను నాటి వాటిని కాపాడాలి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా ముందుకు తీసుకెళ్తూ.. మొక్కల పెంపకంపైన అవగాహన కల్పిస్తున్న రోజాని ఎంపి సంతోష్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించాలి ః విశాఖ ఏజన్సీ ఎంఎల్‌ఎ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
నగరి శాసనసభ్యురాలు రోజా ఆదేశాల మేరకు స్థానిక పాడేరు కస్తూరిబాయ్ విద్యాలయంలో ఎంఎల్ఎ భాగ్యలక్ష్మీ మొక్కలు నాటారు. విశాఖ ఏజన్సీ శాసనసభ సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పాడేరు, మండలం లగినపల్లి, కస్తూరిబాయి పాఠశాల ప్రాంగణంలో గ్రీన్ ఛాలెంజ్ రోజా వనంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రకృతికి అన్ని కార్యాలయాల్లో పాఠశాలలో మొక్కలు నాటి పచ్చదనంగా తీర్చిదిద్ది అచ్చమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ని తీసుకోవాలని సూచించారు. దీనికి పునాదులు విద్యార్థులేనని తమ తమ ప్రాంతాలలో గ్రామాలలో పచ్చదనం మొక్కలు నాటి ప్రాంతాలను గ్రామాల్లోని పచ్చదనాన్ని పెంచి స్వచ్ఛమైన ప్రకృతిలో అచ్చమైన ఆక్సిజన్‌ని పిలిచి ఆరోగ్యాన్ని ప్రకృతిని సంరక్షించుకోవాలి అని సూచించారు.

స్వచ్ఛంద సంస్థల సహకరాంతో మొక్కలను సేకరించి అచ్చమైన ప్రకృతిలో భాగంగా మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలి పీల్చాలని కోరారు. దేశంలో ఢిల్లీ లాంటి ప్రముఖ నగరాలలో కృత్రిమ ఆక్సిజన్‌ను కొనుక్కొని పీల్చే పరిస్థితి నెలకొంటుందని ఆర్.కె.రోజా నగరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రీన్ ఛాలెంజ్, రోజావనంలో భాగంగా శుక్రవారం లగినపల్లి కస్తూరిబాయ్ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

విద్యార్థులు బాగా చదివి విద్యావంతులుగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుల్లిబాబు, సింహాచలం అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, స్థానిక ఎంఎల్‌ఎ కొట్టగుల్లి భాగ్యలక్ష్మిని ప్రత్యేక చొరవతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్న సిని నటి, నగరి నియోజకవర్గం ఎంఎల్‌ఎ రోజాని ప్రత్యేకంగా అభినందించారు.

Green India Challenge is getting an extraordinary response
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News