Home చిన్న సినిమాలు రెండు డిఫరెంట్ గెటప్పులతో ఎనర్జిటిక్‌గా రామ్

రెండు డిఫరెంట్ గెటప్పులతో ఎనర్జిటిక్‌గా రామ్

Ram

 

ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్‌లు, లవ్ స్టోరీలతో హిట్లు కొట్టే ట్రెండ్ నడుస్తోంది. ఆ తరహాలోనే వస్తున్న మరో చిత్రం ‘రెడ్’. రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్‌టైనర్. ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయి. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం అసలేం జరుగుతోంది? అన్న సస్పెన్స్ ఎలిమెంట్‌తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభినయం ఊహకందని ట్విస్టులతో ఆసక్తిని కలిగిస్తోంది. రామ్ తన కెరీర్‌లోనే బెస్ట్ లుక్‌తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్పులతో ట్రైలర్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించాడు.

క్రిమినల్ గెటప్‌కి, సాఫ్ట్‌వేర్ వేషానికి మధ్య తేడా ఆకట్టుకుంది. నివేదా థామస్, మాళవిక శర్మ, నాజర్, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలోని రెండు పాటలను యూరప్ డోలమైట్స్, ఇటలీ పర్వత సానువుల్లో తెరకెక్కించడం విశేషం. సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులో ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీకరించిన పాట హైలైట్‌గా ఉండనుంది. నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ“ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్‌టైనర్. ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం”అని అన్నారు.

 

Red teaser released