Sunday, April 28, 2024

గ్రూప్ 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : జూన్ 11న జరిగే గ్రూప్ 1 పరీక్షలు జిల్లా లో పకడ్బందీగా నిర్వహించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలు రాసేందుకు వనపర్తి జిల్లాకు 4343 మంది అభ్యర్థులను కేటాయించడం జరిగిందన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని వసతులు కలిగిన 14 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 4 రూట్లుగా రూ పొందించుకుని ప్రశ్నా పత్రాలు సమయానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయ డం జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుందని అందువల్ల అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 నుంచి 10.15 గంటల వరకు అనమతించడం జరుగుతుందన్నారు.

10.15 త ర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని తెలిపా రు. ఈ విషయాన్ని పరీక్షలు రాసే అభ్యర్థులు గుర్తించాలని తెలిపారు. పరీక్ష రో జున జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచడం, 144 సెక్షలు అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఉండే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఆర్డిఓ పద్మావతి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News