Thursday, May 2, 2024

మెట్రోకు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -

Growing popularity for hyderabad metro

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రో కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా పాటు నిలిచిపోయి సర్వీసులు ఈనెల 7వ తేదీ నుంచి పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. మెట్రో అధికారులు దశల వారీగా మూడు రోజుల పాటు మూడు కారిడార్లపై రైళ్లను ప్రారంభించి, కేంద్ర ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటలవరకు సర్వీసు నడిపిస్తున్నారు. కరోనా వైరస్ సోకకుండా మెట్రో సిబ్బంది, ఎప్పటికప్పుడు స్టేషన్ల శానిటైజేషన్ చేసి, ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూస్తూ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు.

రైళ్లలోకి వెళ్లగా మార్కింగ్ చేసిన చోటు కూర్చోవాలని, నిలబడాలని ప్రకటన చేస్తూ ప్రయాణికుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల 7న మొదటి కారిడార్ ఎల్బీనగర్, మియాపూర్ మార్గంలో 120ట్రిప్పులు రైలు నడిపి 19వేలు చేరవేసింది. 8వ తేదీన మొదటి కారిడార్‌తో పాటు నాగోల్, రాయదుర్గం కారిడార్‌లో 240 ట్రిప్పులు నడిపిన రైళ్లులో 26వేలు ప్రయాణించగా, ఈనెల 9న మూడు మార్గాల్లో 680ట్రిప్పులు నడిపించి31వేల ప్రయాణికులను పలు ప్రాంతాలకు చేరవేశారు. 10వ తేదీన 32,500మంది, ఈనెల 11న 690ట్రిప్పులు నడపడంతో 35,100 ప్రయానించినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో 45వేల మంది ప్రయానించవచ్చని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు.

మెట్రో స్టేషన్లకు వచ్చేందుకు గతంలో ఆర్టీసీ బస్సులు ఉండటంతో కాలనీ, బస్తీల నుంచి నేరుగా స్టేషన్‌కు వచ్చి గమ్యస్దానాలకు చేరేవారని, ప్రస్తుతం సొంత వాహనాలు ఉన్నవారే వస్తున్నారని, బస్సులు ప్రవేశపెడితే మెట్రోకు జనాదరణ పెరుగుతుందని పేర్కొంటున్నారు.అదే విధంగా హైటెక్ సిటీ, మియాపూర్, వనస్దలిపురం, ఉప్పల్ వెళ్లే ప్రైవేటు ఉద్యోగులంతా రైళ్లులో వెళ్లేవారని, కరోనా కారణంగా ఆసంస్దలు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించడంతో వారు రాకపోవడంతో కొంత ప్రయాణికులు సంఖ్య తగ్గిందని, నగరంలో అన్ని కార్యాలయాలు, ఆర్టీసీ సేవలు ప్రారంభమైతే మెట్రో రైళ్లుకు ఆదరణ పెరిగి పూర్వవైభవం వస్తుందని మెట్రో ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News