Saturday, May 4, 2024

వలసకూలీలతో కరోనాకు రెక్కలు

- Advertisement -
- Advertisement -

wings to Coronavirus with migrant workers

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారికి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ఎంత శ్రమించిన వైరస్ ఏదో రూపంలో విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తగ్గినట్లే తగ్గి పుంజుకోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2న సాప్ట్‌వేర్ ఇంజనీర్ ప్రారంభమైన కరోనా మర్కజ్ బాధితులతో ఉనికిని చాటుకుని, మహారాష్ట్ర, రాజస్దాన్‌లకు వెళ్లిన కార్మికులు తిరిగిన స్వస్దలాలకు రావడంతో వైరస్ రెచ్చిపోయి రోజుకు 1200లకు పైగా పాజిటివ్ కేసులు నమోదై రాష్ట్రంలో మహానగరం అగ్రస్దానంలో నిలిచింది. దీంతో అధికారులు పలు ప్రాంతాలను కంటైన్‌మెంటు జోన్లుగా విభజించి, ప్రజలు రోడ్లపై తిరగకుండా నిబంధనలు కఠినంగా పాటించి ఆగస్టు రెండోవారంలోగా తగ్గుముఖం పట్టించి రోజుకు 148 కేసులకు తీసుకొచ్చారు. రెండు నెలకితం కరోనా విజృంభణ చేసే సమయంలో పట్టణం వీడిచి పల్లెలకు వెళ్లి వలసకూలీలు గత 20 రోజుల నుంచి నగరానికి మళ్లీ ఉపాధి కోసం రావడంతో మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.

కూలీలంతా భవన నిర్మాణా కార్మికులు కావడంతో వారంతా ఒకే దగ్గర చేరి పనులు చేస్తూ ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వాడకుండా ఉండటతో ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలామంది లేబర్ మేస్త్రీలకు తాము పనిచేసే వద్ద కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో గత మూడు రోజుల నుంచి జిల్లా వైద్యాధికారులు ఏప్రాంతాల్లో వలసకూలీలు ఎక్కువగా ఉన్నారో గుర్తించే పనిలో పడ్డారు. బస్తీలు ,కాలనీలకు ఆశవర్కర్లు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తల వెళ్లి ఎంతమంది నగరానికి చేరుకున్నారో ఇంటింటికి తిరిగి స్దానిక ప్రజల నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తుంది .వీరితో మాట్లాడి వైరస్‌పై అవగాహన చేయడంతో పాటు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే స్దానికంగా ఉండే పట్టణ ఆరోగ్య కేంద్రాలు తీసుకెళ్లి ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

లక్షణాల తీవత్ర ఉంటే ఆసుపత్రికి తరలించడం, తక్కువగా ఉంటే హోం క్వారంటైన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల మొదటి వారం నుంచి నమోదై కేసుల్లో అధికంగా వలసకూలీలు ఉన్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నగరానికి సుమారుగా 3లక్షలమంది కూలీలు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. గత ఆరునెల కాలంలో నగరంలో 4లక్షలమందికి టెస్టులు చేయగా, 56వేల పాజిటివ్ కేసులు నమోదై 756మంది మృత్యువాత పడ్డారు. గత పదిరోజులు నగరంలో టెస్టులు 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీదవాఖానలో టెస్టులు పెంచి రోజుకు 150మందికి చేస్తున్నట్లు, వలసకూలీలు అక్కడికి వెళ్లితే ఉచితంగా పరీక్షలు చేస్తారని, లక్షణాలున్న వారు వెళ్లాలని సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News