Friday, April 26, 2024

ప్రయాణికుల కోసం అందుబాటులోకి మరిన్ని రైళ్లు

- Advertisement -
- Advertisement -

Railways to run 80 new passenger trains

హైదరాబాద్: భారతీయ రైల్వే శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ ఇప్పటివరకు 310 రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్టయ్యింది. లాక్‌డౌన్ తరువాత భారతీయ రైల్వే శాఖ 230 రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, మే 12 వ తేదీ నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లను, జూన్ 1వ తేదీ నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం మరో 80 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

07007 సికింద్రాబాద్ నుంచి దర్భంగా ప్రయాణం

రైల్‌నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి దర్భంగా వెళుతోంది. ప్రతి మంగళవారం, శనివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 07008 దర్భంగా నుంచి సికింద్రాబాద్‌కు రైళ్ల రాకపోకలు సాగించనుండగా ఈ రైలు గురు, శుక్రవారాల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 08517 రైలు కోర్బా నుంచి విశాఖపట్టణం ప్రయాణిస్తుండగా ప్రతి రోజు సాయంత్రం 4.10 నిమిషాలకు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 08518 విశాఖపట్టణం నుంచి కోర్బాకు ప్రతి రోజు రాత్రి 8.05 నిమిషాలకు అందుబాటులో ఉంటుంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్‌లలో ఆగతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. 07563 హైదరాబాద్ నుంచి పర్భనీకి ప్రతి రోజు వెళుతోంది, దీంతోపాటు 07564 రైలు పర్భనీ నుంచి హైదరాబాద్‌కు వస్తుందని అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు అందుబాటులోకి….

02615 చెన్నై నుంచి న్యూఢిల్లీకి, 02616 న్యూ ఢిల్లీ నుంచి చెన్నైకి ప్రతి రోజు వెళతాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి. 02669 చైన్నై నుంచి చాప్రాకు సోమవారం, శనివారం, 02670 చాప్రా నుంచి అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్‌లలో ఆగుతాయి. 02663 హౌరా నుంచి తిరుచ్చిరాపల్లికి గురువారం, శనివారం నడవనుండగా, 02664 తిరుచ్చిరాపల్లి నుంచి హౌరాకు మంగళవారం, శుక్రవారం నడుస్తాయి.

ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. 08401 ఖుర్దారోడ్ నుంచి ఓఖాకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1.55 నిమిషాలకు, 08402 ప్రతి బుధవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లలో ఆగుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News