Sunday, April 28, 2024

‘హోమ్ ఫర్ ది డిసేబుల్డ్’తో గస్ ఎడ్యుకేషన్ ఇండియా భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాము సేవలందిస్తున్న కమ్యూనిటీలలో సానుకూల ప్రభావం చూపాలనే నిరంతర నిబద్ధతలో భాగంగా, గస్ ఎడ్యుకేషన్ ఇండియా తమ జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం, తాము 1933 నుండి మార్పును తీసుకురావటానికి కృషి చేస్తున్నNGO “హోమ్ ఫర్ ది డిసేబుల్డ్”తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది.

సమిష్టి ప్రయత్నంలో, తమ ఉద్యోగులు కలిసికట్టుగా ముందుకు రావటంతో పాటుగా దివ్యాంగుల గృహానికి వివిధ రకాల అవసరమైన వస్తువులను విరాళంగా అందించారు. ఈ తోడ్పాటులో భాగంగా 10 ప్యాక్‌ల డైపర్‌లు (ఒక్కో ప్యాక్‌లో 60 డైపర్‌లు ఉంటాయి), 23 ప్యాకెట్లు శానిటరీ ప్యాడ్‌లు, 64 ట్యూబ్‌లు టూత్‌పేస్ట్, 543 షాంపూ సాచెట్స్ , 80 టూత్ బ్రష్‌లు, 43 బాటిళ్లు హెయిర్ ఆయిల్, 163 స్నానపు సబ్బులు, 100 అడల్ట్ డైపర్‌లు, 125 డిటర్జెంట్ బార్‌లు, 90 ప్యాకెట్ల డిటర్జెంట్ పౌడర్, 90 ప్యాకెట్ల కాటన్ బ్యాండేజీలు, 100 డిస్పోజబుల్ సూదులు, 100 నోవాఫైన్ ఇన్సులిన్ సూదులు, టీ-షర్టులు, చీరలు, షర్టులు, ప్యాంట్లు, స్వెటర్లు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు వంటి అనేక రకాల వస్తువులు టాప్స్, మొత్తం 301 పీస్ ల దుస్తులు అందించారు. అదనంగా, క్లీనర్‌లు, టాయిలెట్ క్లీనర్‌లు, సీలింగ్ ఫ్యాన్, ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫేస్ టవల్స్, బాత్ టవల్స్, కుక్కర్‌తో సహా వివిధ గృహోపకరణాలు,నిత్యావసర వస్తువులు కూడా విరాళంగా అందించబడ్డాయి.

“తమ జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమం ద్వారా “హోమ్ ఫర్ ది డిసేబుల్డ్”కి మా మద్దతును అందించడానికి GEI వద్ద మేము గర్విస్తున్నాము. కలిసికట్టుగా, అవసరమైన వారి జీవితాల్లో అర్ధవంతమైన ప్రభావాన్ని చూపడానికి కృషి చేస్తున్నాము” అని గస్ ఎడ్యుకేషన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, శశి జలిగామ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News