Saturday, September 20, 2025

సిఈఐఆర్‌తో బాధితుడికి ఫోన్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

జగదేవ్‌పూర్: జగదేవ్‌పూర్ పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా 24 గంటల్లో గుర్తించి భాధితుడికి అందజేశారు. జగదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మునిగడప గ్రామానికి చెందిన సతీష్ ఈ నెల 16న రాత్రి వన విఓఎస్ 25 ఫోన్‌ను పొలం నుండి ఇంటికి వస్తుండగా దారిలో ఎక్కడో పోగోట్టుకున్నారు. వెంటనే జగదేవ్‌పూర్ పోలీసులకు ఫోన్ పోయిన సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐకృష్ణమూర్తి ఆదేశానుసారం కానిస్టేబుల్ రమేశ్, మొబైల్ నీ ట్రాక్ చేసి ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు. మంగళవారం బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని పోయిన్ ఫోన్‌ను అప్పగించారు.  ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పొగొట్టుకుంటే వెంటనే ఫోన్, పూర్తి వివరాలు సిఈఐఆర్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని సూ చించారు. అందించిన వారిలో పోలీస్ సిబ్బంది ఎఎస్‌ఐ రమణరెడ్డి, కానిస్టేబుల్ చంద్రం,రమేశ్, సంద్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News