Tuesday, June 17, 2025

మళ్లీ వస్తున్న ‘హనుమాన్ జంక్షన్’

- Advertisement -
- Advertisement -

2001లో విడుదలైన హనుమాన్ జంక్షన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్, అద్భుతమైన హాస్యం మేళవించిన ఈ సినిమాలో అర్జున్, జగపతి బాబు, వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తరువాత తమిళ జయం, తనీ ఒరువన్, గాడ్‌ఫాదర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. లయ, స్నేహ, విజయలక్ష్మి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్.బి. శ్రీరామ్, ఎం.ఎస్. నారాయణ,

వేణు మాధవ్ వంటి ప్రముఖులు హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఎడిటర్ మోహన్ స్థాపించిన ఎం.ఎల్. మూవీ ఆర్ట్ బ్యానర్‌పై ఎం.వి. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్‌ను తీసుకువచ్చాయి. ఇప్పుడు ఈ ఎవర్ గ్రీన్ ఎంటర్‌టైనర్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది. హనుమాన్ జంక్షన్ ను జూన్ 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News