Saturday, August 9, 2025

హ్యాపీ బర్త్ డే మహేశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. మహేశ్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మహేశ్‌బాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ రిలీజ్ కావడంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

తెలుగు సినీ పరిశ్రమకు మహేశ్ హీరో కావడం గర్వకారణమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఏళ్లు గడిచేకొద్దీ యంగ్ కనిపిస్తున్నారని కొనియాడారు. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరు తెలిపారు.

మహేశ్ ఎన్నో విజయాలను అందుకోవాలని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. #ssmb29 మూవీ ఎప్పుడు విడుదల అవుతుందని ఆసక్తితో ఎదురుచూస్తున్నామని, మహేశ్‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మహేశ్‌బాబును ఎవరితోనూ పోల్చలేమని హీరో నారా రోహిత్ తెలిపారు. మహేశ్ నటిస్తున్న #ssmb29 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. నారా రోహిత్ సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News