Thursday, May 30, 2024

ముందుగా 2024కి వెల్కమ్ చెప్పే దేశాలేంటో తెలుసా?

- Advertisement -
- Advertisement -

గడిచిన సంవత్సరానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరో సంవత్సరానికి వెళ్లడానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల కోసం ప్లాన్స్ చేస్తున్నారు జనాలు. ప్రపంచ దేశాల్లో ఆయ సమయాలను బట్టి న్యూయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కొన్ని దేశాల్లో 2024 ముందుగానే వస్తోంది. ప్రపంచంలో మొదటగా, చివరిగా నూతన సంవత్సరాన్ని స్వాగతించే దేశాలేవో మీకు తెలుసా?. భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31 మ. 3.30 గంటలకే పసిఫిక్ దీవులు టోంగా, సమోవా, కిరిబాటి దేశాలు ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. ఇక ప్రపంచంలో అందరికంటే ఆలస్యంగా అమెరికాలోని హౌలాండ్, బేకర్ దీవులలో జనవరి 1తేదీ సాయంత్రం 5:30 గంటలకు న్యూఇయర్ ప్రారంభమవుతుంది. అక్కడి  వారు ప్రపంచంలో చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News