Saturday, June 21, 2025

అభిమానులకు గుడ్‌న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే..

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదాపడింది. నిజానికి ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల చిత్రం విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. తాజాగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందించింది. ఈ చిత్రాన్ని జూలై 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు శనివారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో పవన్, బాబీ డియోల్‌ని మనం చూడొచ్చు. ఇక ఈ సినిమాకు (Hari Hara Veera Mallu) కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా.. మరికొంత భాగం నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. పవన్‌ ఈ చిత్రంలో మునుపెన్నడు చూడని విధంగా ఓ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News