Sunday, April 28, 2024

బసవుడి పాలనను మహారాష్ట్ర వెళ్లి తెలుసుకున్నా: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట:  గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలిజ సమాజాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వీరశైవ బలిజ సమాజ మహాసభలో పాల్గొని మంత్రి మాట్లాడారు. “రూ.కోటి రూపాయలతో హైదరాబాదు ట్యాంకు బండ్ పై బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేశాం. హైదరాబాద్ లో రూ.20 కోట్ల విలువైన స్థలం, 10 కోట్ల స్థలం ఇవ్వటం, అన్నీ చోట్ల భూములు, బసవ భవనాలు నిర్మించుకుంటున్నాం. త్వరలో సిద్దిపేటలో బసవేశ్వరుని భవనాన్ని నిర్మిస్తాం. బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. జిల్లాలో బలిజలు ఎక్కువ. మీతో అవినాభావ సంబంధమున్నది.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, కష్టం గురించి వివరించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు. బసవుడి పాలనను మహారాష్ట్రలో స్వయంగా వెళ్లి తెలుసుకున్నా. బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం. బసవుడి ఆలోచనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం మనది. సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టుకున్నాం. సీఎం కేసీఆర్ ఆలోచన ఎప్పుడు పేదలను ఆదుకోవాలన్నదే. మీ అందరి సహకారం, బలంతోనే ఈ అభివృద్ధి. నాతో మీరు ఉన్నా అన్నప్పుడు నేను కూడా ఎప్పుడూ మీ వెంట ఉంటా. రుద్రభూమికి అవసరమైన స్థలంతో పాటు, బసవ కళ్యాణ మండపం నిర్మిస్తాం. జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో మీకు ఎప్పుడు అండగా ఉంటాను” అని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News