Friday, May 3, 2024

వినూత్న రీతిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన…. 24న ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

వినూత్న రీతిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన
24న ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

Harish Rao will inaugurate National Park Exhibition

మనతెలంగాణ/హైదరాబాద్:  జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శనను ఈ సారి వినూత్న రీతిలో నిర్వహించనున్నట్టు ప్రదర్శన నిర్వాహకులు ఖలీద్ ఆహ్మద్ జమీర్ వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యాన ప్రదర్శన ఏర్పాట్లును వివరించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు , నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 24న ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రతియేటా జనవరి 26నుంచి నిర్వహించే ఈ కార్యక్రమం కోవిడ్ కారణంగా గత రెండెళ్లుగా నిర్వహించలేకపోయామన్నారు.

ఈ సారి వినూత్న రీతిలో .జాతీయ వ్యవసాయ , ఉద్యాన ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల పూల మొక్కలు, మరుగుజ్జు వృక్షాలు, అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు, ఆక్సిజన్ ప్యూరిఫైయర్స్ , వివిధ రకాల పండ్ల మొక్కలు , సేంద్రీయ ఎరువులు , సిరామిక్ ,ప్లాస్టిక్ కుండీలు, అత్యంత నాణ్యమైన వివిధ రకాల విత్తనాలు, బల్బులు, వివిధ రరాల ఉద్యాన పరికరాలకు సంబంధించి మొత్తం 120స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అధిక ఉష్ణోగ్రతల్లో పండించే యాపిల్ మొక్కలు కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 24నుంచి 28వరకూ 5రోజుల పాటు నిర్వహించే ఈ జాతీయ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలతో నిర్వహించే ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 9నుంచి రాత్రి 9వరకు ఉంటుందన్నారు. ఈ సారి లక్షల సంఖ్యలో సందర్శకులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నట్టు తెలిపారు.రూప్ గార్డెన్స్ నిర్వాహకులు హెచ్ శ్రీనివాసరావుతో సహకారంతో ఈ సారి మిద్దెతోటల సాగు దారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇంటింటా మిద్దెతోట నినాదంతో ప్రజలను చైతన్యపరచనున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News