Monday, April 29, 2024

60 రోజుల్లో హరీశ్ రావు అలుపెరుగని ప్రచారం

- Advertisement -
- Advertisement -

విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటనలు
80కి పైగా ప్రచార సభలు, రోడ్ షోలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకులు, మంత్రి హరీశ్ రావు అక్టోబర్, నవంబర్ నెలల్లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజాఆశీర్వాద సభలు, రోడ్ షోలో పాల్గొని ఆయా జిల్లాల క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి, మూడోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే అమలు చేసే మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడంలో మంత్రి హరీష్ రావు సఫలీకృతుడయ్యారు. ఎన్నికల్లో గెలిస్తే సన్న బియ్యం, రైతు బంద్, రూ.400లకే సిలిండర్.. వంటి హామీలను ప్రజలకు వివరించారు.

ఆయా నియోజకవర్గాలలో ఎంఎల్‌ఎ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా హరీశ్‌రావు ఓటర్లను కోరారు. రిస్క్ వద్దు కారుకే ఓటు గుద్దు అంటూ హరీష్ రావు ఇచ్చిన నినాదాలు ప్రజల్లో మార్మోగుతున్నాయి. కారు, హెలికాప్టర్ ద్వారా హరీశ్‌రావు ఆయా జిల్లాల్లో జరిపిన పర్యటనలు బిఆర్‌ఎస్ గెలుపును మరింత దగ్గర చేశాయి. రెండు నెలల పాటు కాలుకు బలపం కట్టుకొని తిరిగిన మంత్రి హరీశ్ రావు, సమయం వృధా కాకుండా ఆయా జిల్లాల కేడర్‌తో కారు ప్రయాణాల్లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రచారం ఒకవైపు నిర్వహిస్తూనే మరోవైపు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు, ఆరోపణలు ఎదుర్కొనేలా తెలంగాణ భవన్, ఇతర జిల్లాల్లో ఎన్నో విలేకరుల సమావేశాలు నిర్వహించారు. టివి ఛానళ్లలో నిర్వహించే డిబేట్‌లో పాల్గొని మూడోసారి తెలంగాణలో బిఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటు అవశ్యత గురించి వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని అదే వేదికగా తిప్పి కొట్టారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ విజయం గురించి వివరించారు. జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు హరీశ్‌ రావు సావధానంగా సమాధానాలు ఇచ్చారు.

పలు సంఘాలతో సమావేశాలు
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కుల, మత సంఘాలతో మంత్రి హరీశ్ రావు సమావేశం అయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. మరోసారి తెలంగాణ ప్రభుత్వం వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి వివరించారు. బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, సిఎం కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎం చేయాలని కోరారు. తెలంగాణ భవన్ సహా వివిధ జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో వేల సంఖ్యలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

అక్టోబర్, నవంబర్ నెలల్లో విస్తృత పర్యటనలు
అక్టోబర్ నెలలో మంత్రి హరీశ్‌రావు మెదక్, తాండూర్, ములుగు, నర్సంపేట, డోర్నకల్, నకిరేకల్, తుంగతుర్తి, మహేశ్వరం, కల్వకుర్తి, దుబ్బాక, గజ్వేల్, మక్తల్, కొడంగల్, దేవరకద్ర, జుక్కల్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, మానకొండూర్, సిద్దిపేట, మంచిర్యాల, చెన్నూరు, జహీరాబాద్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, అదిలాబాద్, స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. అలాగే నవంబర్ నెలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మెదక్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు, సిద్దిపేట, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, ఉప్పల్, హుజురాబాద్, ములుగు, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, నారాయణ్‌ఖేడ్, మానకొండూరు, మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, జనగాం, ఆలేరు, భువనగిరి, రాజేంద్రనగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

Harish Rao's tireless campaign in 60 days

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News