Thursday, May 2, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 47,332 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1046 క్యూసెక్కులు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1073 అడుగులుగా ఉంది.

ఇక, ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 35 టీఎంసీలుగా ఉంది. రానున్న రోజుల్లో అధిక వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News