Wednesday, May 8, 2024

తెలంగాణకు భారీ వర్షసూచన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం గంగటిక్ పశ్చిమ బెంగాల్ పరిసరరాలలోని ఉత్తర ఒడిస్సా దగ్గర సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కి.మి ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపునకు వంగివుంది.

గురువారం తూర్పు పశ్చిమ ద్రోణి (షీర్‌జోన్) సగటు సముద్ర మట్టానికి 4.5నుండి 7.6కి.మి ఎత్తు మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని తూర్పు జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News