హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ బంగాళాఖాత వరకు ద్రోణి కొనసాగనుంది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా వర్షపాతం వివరాలు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15.9సెం.మీ అత్యధిక వర్షం కురసింది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.3 సెం.మీ, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 14 సె.మీ వర్షం, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 13.2 సెం.మీ, వలిగొండ మండలం వెంకటపల్లెలో 11.5 సెం.మీ, హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో 12.7 సెం.మీ, సరూర్‌నగర్‌లో 12.8 సెం.మీ, ఖైరతాబాద్‌లో 12.6 సె.మీ, గండిపేటలో 12.2 సె.మీ, యూసుఫ్‌గూడలో 12.4 సె.మీ, ఉప్పల్‌లో 11.7 సె.మీ, ఎల్బీనగర్లో 11.3 సెం.మీ, అమీర్‌పేటలో 11.1, షేక్‌పేటలో 11.1 సెం.మీ వర్షం కురిసింది.