Monday, February 17, 2025

బిఆర్‌ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నల్లగొండలో బి ఆర్‌ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. నల్లగొండలో ఈనెల 28వ తేదీన క్లాక్ టవర్ సెంటర్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వర కు బిఆర్‌ఎస్ రైతు ధర్నా కార్యక్రమానికి హై కోర్టు అనుమతిం చింది. మంగళవారం జరగాల్సిన రైతు మహాధర్నాకు జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బిఆర్‌ఎస్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రైతు మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని

డిమాండ్ చేస్తూ ఈ నెల 21న నల్లగొండలో బిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీ సులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసిన్ప్పటికీ, జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బిఆర్‌ఎస్ రైతు ధర్నా అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు బిఆర్‌ఎస్ రైతు మహాధర్నాకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన జరిగే బిఆర్‌ఎస్ రైతు మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి,, పలువురు నాయకులు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News