Tuesday, April 30, 2024

చట్టపరంగా ఎదుర్కొంటాం తలవంచేది లేదు: డికె శివకుమార్‌

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖ నేత డికె శివకుమార్‌కు గురువారం కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. లెక్కల్లోకి రాని, ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డికె క్యాష్ పిటిషన్ పెట్టుకున్నారు. తనకు న్యాయస్థానంపై , చట్టాలపై అపార విశ్వాసం ఉందని అన్నింటిని ఎదుర్కొంటానని కాంగ్రెస్ నేత, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ తెలిపారు. హైకోర్టు రూలింగ్, క్వాష్ పిటిషన్ కొట్టివేత తరువాత గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

న్యాయపరంగా తాను సిబిఐ కేసును ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో బిజెపి కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని విమర్శించారు. జెడిఎస్ నేత కుమారస్వామి తనను తీహార్ జైలుకు పంపిస్తారని చెపుతున్నారని , ఇటువంటి వాటికి బెదిరేది లేదని పిసిసి నేత కూడా అయిన డికె తెలిపారు.

బిజెపి ఆదేశాలతోనే సిబిఐ రంగంలోకి దిగిందని, తన తన భార్య ఆస్తుల గురించి సిబిఐ దర్యాప్తు జరిపిందని అయితే ఇంతవరకూ వీటిపై సిబిఐ తమను ఏమీ అడగలేదని తెలిపిన డికె ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తి అయ్యి ఏదో నిర్థారణకు వచ్చినట్లు చెప్పడం ఏం న్యాయం అన్నారు. అరెస్టుల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పనిగట్టుకుని వేధింపులకు దిగుతోందని భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ అయ్యి ఉండొచ్చు..ఇదంతా రాజకీయాలలో భాగమే ’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News