Tuesday, May 7, 2024

ఇంగ్లీషుకు హిందీ ప్రత్యామ్నాయం కావాలి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Sha on Hindi

న్యూఢిల్లీ:  ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారతీయ భాషలోనే ఉండాలని, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా,  ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ అధ్యక్షుడిగా ఉన్న షా, కేంద్ర మంత్రివర్గం యొక్క 70% ఎజెండా ఇప్పుడు హిందీలో తయారు చేయబడిందని సభ్యులకు తెలియజేశారు.

దేశ ఐక్యతలో అధికార భాషను ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, ఇతర భాషలను మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారత భాషలోనే ఉండాలని ఆయన అన్నారు. స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా అన్నారు. ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మార్చితే తప్ప, ప్రచారం జరగదని ఆయన పేర్కొన్నారు.

ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో 22,000 మంది హిందీ ఉపాధ్యాయులను నియమించినట్లు షా తెలిపారు. అలాగే, ఈశాన్య ప్రాంతంలోని తొమ్మిది గిరిజన సంఘాలు తమ మాండలికాల లిపిలను దేవనాగరిలోకి మార్చుకున్నాయి మరియు ఈశాన్య రాష్ట్రాలలోని ఎనిమిది రాష్ట్రాలు పదవ తరగతి వరకు పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడానికి అంగీకరించాయి.పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి షా అధ్యక్షత వహించారు. కమిటీ ఉపాధ్యక్షుడు భృతహరి మహతాబ్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News