Friday, September 19, 2025

హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి : నిరంజన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో భద్రత లేకుండా పోయిందని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్ మాట్లాడారు. పార్లమెంట్ లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి దాడులు చేసే ప్రయత్నం చేశారంటే భద్రత వైఫల్యం ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ పాలన డొల్లతనం బయటపడిందని దుయ్యబట్టారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పార్లమెంట్ లోనే ఇలా ఉంటే దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోందన్నారు. ఈ విషయంలో హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిరజంన్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News