Friday, May 3, 2024

కళ్ళకలకకు హోమియో వైద్యం

- Advertisement -
- Advertisement -

కళ్ళకలక లేదా పింక్ ఐ… వైరస్, బాక్టీరియా లేదా అలెర్జీ కారకాల వల్ల సంభవిస్తుంది. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, భారీగా వచ్చిన వరదల కారణంగా చాలా ప్రదేశాల్లో వర్షపు నీరు నిలిచి కలుషితం కావడం వల్ల, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ అతిగా వృద్ధి చెంది వివిధ ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నది. ఇప్పుడు దేశమంతా విస్తరిస్తున్న ‘అడినో వైరస్’ వల్ల కళ్ళకలక మహమ్మారిలా విజృంభిస్తోంది.మెల్లమెల్లగా జంటనగరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నది. తగిన జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్య ఏమి కాదు.కళ్ళకలక వాస్తవానికి మామూలు సమస్యే. దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో, కొందరిలో తీవ్ర దుష్పరిణామాలకు దారితీయవచ్చు. వారం, పది రోజుల్లో తగ్గక సమస్య తీవ్రంగా వేధిస్తుంటే కంటి డాక్టర్ సలహా తీసుకోవాలి. దీని వల్ల కంట్లో దీర్ఘకాలిక సమస్యలు లేదా ఇతర దుష్ప్రభావాలు తలెత్తకుండా నివారించవచ్చు. కళ్ళకలక పిల్లల్లో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్ళే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంది పిల్లలు చాలా సమయం ఒకే ప్రదేశంలో కలిసి ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర నియమాలు పాటించే విషయం లో సరియైన అవగాహన లేకపోవడం, అన్నింటికీమించి రోగ నిరోధక శక్తితక్కువగా ఉండటం ముఖ్య కారణాలు.
కళ్లకలక కొన్ని సాధారణ లక్షణాలు
ఒకటి లేదా రెండు కళ్ళు ఎరుపెక్కటం/ కళ్లలో నిరంతరం నీరుకారడం/ కళ్లలో దురద, నొప్పి/ కళ్ళలో ఏదో కుచ్చుకుంటున్నట్లుగా ఉండటం/ కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా) కొన్ని సార్లు దృష్టి మసకబారుతుంది.
పై లక్షణాలతోపాటు కొన్ని సందర్భాల్లో ముక్కు కారడం , జ్వరం, తల నొప్పి లక్షణాలు కూడా కలిసి ఉంటాయి.
‘ఇది దానంతట అదే తగ్గిపోతుంది,పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటే లేదా ఒక వారం కంటే ఎక్కువ కాలం కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం మంచిది, కళ్ళకలక సోకిన వ్యక్తిని చూడడం వల్ల తమకూ అంటుకుంటాయని మూఢనమ్మకం ఉంది, కాని ఇది తప్పు. ఎందుకంటే సోకిన వారి కళ్ళలోకి చూడటం ద్వారా కళ్ళకలక వ్యాపించదు.
కళ్లకలక జాగ్రత్తలు
వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.- / కళ్లను రుద్దడం మానుకోండి.- / చల్లని నీటితో కళ్ళు కడగడం మంచిది.-/ అలర్జిక్ కంజక్టివిటిస్‌తో బాధపడుతుంటే, అలెర్జీ కారకాలకు దూరంగా ఉండండి.- / కళ్ళ కలక ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్సులు ధరించడం మానుకోండి.- పిల్లలకు మంచి నీళ్ళు ఎక్కువగా తాగించాలి.
కళ్ళకలక నివారణ ఎలా?
ఈ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి మంచి పరిశుభ్రత పద్ధతులు ఉత్తమ మార్గాలు, ఉదాహరణకి:
మీ చేతులతో మీ కళ్లను తాకవద్దు. తరచుగా చేతులు కడుక్కోవాలి./ రోజూ శుభ్రమైన టవల్, వాష్ క్లాత్ ఉపయోగించండి./ ప్రభావిత వ్యక్తులను ఒంటరిగా ఉంచ డం వల్ల వ్యాప్తి పరిమితం కావచ్చు./ తాజా ఆహార పదార్థాలు, సీజనల్ ఫ్రూట్స్, విటమిన్ సి, జింక్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధకత ఏర్పడుతుంది.
కళ్లకలకకు హోమియోపతి చికిత్స
కళ్ళకలకను హోమియోపతి మందులతో సులభంగా, సురక్షితంగా నయం చేయవచ్చు. ఈ మందులు త్వరితగతిన కోలుకునేలా చేస్తాయి, ఆ వ్యక్తి బాధల తీవ్రతను తగ్గిస్తాయి. కళ్ళకలక నివారణలో కూడా హోమియో ఔషధాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. హోమియోపతిలో కళ్ళకలక చికిత్సకు విస్తృత పరిధి ఉన్నందున వ్యక్తిగత లక్షణాలు, ఇటియాలజీ ఆధారంగా సరియైన ఔషధం ఎంపికచేసి ఇవ్వవలసి ఉంటుంది.
సాధారణంగా ఈ క్రింది హోమియో మందులను కళ్ళ కలక చికిత్సలో ఉపయోగిస్తారు.
యుఫ్రేషియా: కళ్ళకలక నివారణలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. 30 పొటన్సీలో రోజుకు ఒక మోతాదు (6 గుళికలు) చొప్పున వరుసగా 3 రోజులు వాడాలి. పిల్లలకు వయసును బట్టి 2 లేదా 3 గుళికల మోతాదు సరిపోతుంది.
అర్జెంటమ్ నైట్రికమ్: చీము వంటి స్రావం, కనురెప్పలు అంటుకుపోవటం, చీలిక నొప్పులతో పాటు ఎర్రగా, వాపుతో ఉన్న కళ్ళకు వాడవలసిన ఔషధం.
పల్సటిల్లా: పసుపు పచ్చ స్రావాలతో కూడిన కళ్లకలక. కనురెప్పలు అతుక్కుపోయి ఉంటాయి, లక్షణాలు సాధారణంగా కోల్ కంప్రెస్‌లతో మెరుగుపడతాయి. చికాకు, మానసిక కల్లోలం కలిగి ఉన్న వ్యక్తులకు ఈ ఔషధం చాలా సరైనది.
బెల్లడోనా: కళ్లకలక మొదటి దశలకు, అకస్మాత్తుగా మంటలు రావడం, రక్తంలా ఎరుపెక్కిన కళ్ళు, కనురెప్పల వాపు, కాంతికి అతి సున్నితత్వం వంటివి ప్రధాన లక్షణాలు. కళ్ళు సాధారణంగా వేడిగా ఉంటాయి, స్పర్శకు కొట్టుకుంటాయి.
సల్ఫర్: కళ్ల మంటలు, నొప్పి, ఎరుపు రంగులో పసుపు స్రావాలతో పాటు దుర్వాసన వస్తుంది. కళ్ళు తరచుగా ఒక దానితో ఒకటి క్రస్ట్‌గా ఉంటాయి, వ్యక్తి సాధారణంగా చాలా వేడిగా, దాహంతో ఉంటాడు.
అపిస్ మెల్లిఫికా: ఎరుపు, మంట, ఉబ్బిన కళ్లకు చల్లని అప్లికేషన్‌లతో మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది.
ఇవి కేవలం ప్రాథమిక అవగాహనకు మాత్రమే. వ్యక్తిగత లక్షణాలు, తీవ్రత, ఇతర సమస్యల ఆధారంగా హోమియో ఔషధాన్ని ఎంపిక చేయవలసి ఉంటుంది.

-డా. గన్నంరాజు దుర్గాప్రసాద్ రావు,  9849182691.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News