Wednesday, May 8, 2024

సాయన్న కల సాకారమవ్వాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కంటోన్మెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో విలీనంతో దివంగత ఎంఎల్‌ఎ సాయన్న కల నేరవేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ కాంక్షించారు. ఎంఎల్‌ఎ సాయన్న మృతి పట్ల రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది. అ సెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటిం చి, ఘన నివాళులర్పించారు. గురువారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల సందర్భంగా సం తాప ప్రతిపాదనలో భాగంగా ముఖ్యమంత్రి మా ట్లాడారు. ‘స్వర్గీయ సాయన్న నాలుగు దశాబ్ధాలు గా రాజకీయాల్లో శాసన సభ్యునిగా అనేక హోదా ల్లో పనిచేశారు. ఆయన వ్యక్తిగతంగా నాకు తెలిసి న వ్యక్తి. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వు తో, చాలా ఓపికతో అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఆయన కంటోన్మెంట్ శాసన సభ్యుని గా ఉండే టైంలో నేను సిఎంగా అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కంటోన్మెంట్ ను ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్ లో కలిపితే బాగుంటుందని,

వీకర్ సెక్షన్స్ కోసం కాలనీ కట్టాలని కంటోన్మెంట్ ప్రజల కోసం తీవ్ర తపన పడి అనేక రిప్రజంటేషన్లు ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రికి చెప్పి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినం. గవర్నమెంటు ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ ను నగరపాలకవర్గంలో కలుపాలని ఒక నిర్ణయానికి వస్తున్నట్లు శుభవార్త అందింది. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. సాయన్న నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ హైదరాబాద్ చేరుకుని ఇక్కడే సెటిలై చిన్నపాటి వ్యాపరవేత్తగా ఉండి… వివాదాలు లేని రాజకీయ నాయకుల్లో సాయన్న ఒకరు. వారి కూతురు లాస్య నందిత రెండు పర్యాయాలు నగరంలో కార్పోరేటర్ గా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. సాయన్న కుటుంబం మా కుటుంబం . సాయన్న కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం. సాయన్న లేని లోటు తీర్చలేనిది” అంటూ ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సాయన్న గారి మృతికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని సభ ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నదని తెలిపారు. సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్పీకర్ ప్రకటన మేరకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.అనంతరం సభ శుక్రవారం నాటికి వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News