Friday, May 3, 2024

ఉత్తుత్తి బిసి ఉద్యమాలు ఇంకెంతకాలం?

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : ఏ పార్టీ టికెటిచ్చినా ఓట్లు వేయాల్సిందే అని బిసి జేఏసీ గౌరవాధ్యక్షుడు, తెలుగుదేశం నాయకులు పాల్వంచ రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జెడ్పి మీటింగ్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ బిసిలకు ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయటమే కానీ ఏదైనా పార్టీ బిసిలకు టికెటిస్తే మొఖం చాటేసుకొని తిరుగుతారని అందుకనే కొన్ని బిసి సంఘాలను మొక్కుబడి సంఘాలుగానే ప్రజలు భావిస్తున్నారన్నారని ఆవేదన భరితంగా చెప్పారు.

అందుకనే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీ, బీఎస్పీ పార్టీ , కమ్యూనిస్టు పార్టీలు కానీ ఆఖరికి బిసిలకు తీరని ద్రోహం చేసిన బిఆర్‌ఎస్ పార్టీ బిసి కులాలకు టిక్కెటిచ్చినా సరే ఓట్లువేసి గెలిపించుకోవాల్సిందిగా వేడుకున్నారు. అందుకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలతో పాటుగా ఓసి వర్గాలవారు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. బిసి వర్గాలను ఏ రాజకీయ పార్టీలు కనీసం పట్టించుకోకపోయినా స్వర్గీయ వీపీ సింగ్, స్వర్గీయ ఎన్టీ రామారావు బిసి వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతగా జయంతి వేడుకలు జరపాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నూతన బిసి జేఏసీ అధ్యక్షుడు చిట్టోజు రమేష్, ప్రధాన కార్యదర్శి టీవీ రాజు, బిసి టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, మధుగౌడ్, నాగరాజు యాదవ్, వెంకటాచారి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News