Monday, May 13, 2024

సరిగ్గా ఇదే రోజున 2001 డిసెంబర్ 13

- Advertisement -
- Advertisement -

ఈ రోజున పార్లమెంట్‌పై దాడి జరిగింది. సరిగ్గా ఇప్పుడు 2023 డిసెంబర్ 13 న కూడా ఇదే విధమైన ఘటన చోటుచేసుకుంది. అప్పుడు పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ లోపలే ఎటువంటి దారుణం జరగని రీతిలో సంచలనాత్మక దాడి జరిగింది. 22 ఏళ్ల క్రితం జరిగిన దాడిలో తొమ్మండుగురు మృతి చెందారు. 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఎప్పటికప్పుడు ఈ నెలలో గుర్తుకు వస్తుంది. అప్పట్లో దుండగులు కారులో వచ్చి పార్లమెంట్ ఆవరణలో కాల్పులు జరిపారు.

ఇప్పుడు పార్లమెంట్ లోపల దాడికి దిగేందుకు యత్నించారు. సభా సమావేశాల దశలోనే ఈ ఘటన జరగడం, ఎంతో భారీ వ్యయ ప్రయాసలతో , మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జాతికి అంకితం చేసిన నూతన పార్లమెంట్‌లోని అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థ లోటుపాట్లను తెలిపింది. జాతిని నివ్వెరపరిచింది. రెండు ఘటనలు దేశ భద్రతకు సవాళ్లు విసిరాయి. అయితే అప్పటి ఘటన విదేశీ శక్తులది. కానీ ఇప్పటి సంచలనం ఎవరిది అనేది దర్యాప్తు క్రమంలో ఎప్పటికైనా తేలాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News