Tuesday, May 14, 2024

అంటార్కిటికా హిమఖండం అడుగున భారీ సరస్సు

- Advertisement -
- Advertisement -

Huge lake at bottom of Antarctic ice sheet

టెక్సాస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధన

వాషింగ్టన్ : ప్రపంచంలోనే భారీ హిమఖండంగా పేర్కొన్న అంటార్కిటికా అడుగున ఇమిడి ఉన్న ఒక నగరం అంత పరిమాణంలోగల సరస్సును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సరస్సును లేక్ ఈగిల్ అని పేరు పెట్టారు. తీరానికి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న అంటార్కిటికా ప్రిన్సెస్ ఎలిజబెత్ ల్యాండ్ ప్రాంతంలో మంచు ఖండం అడుగున మైలు లోతు లోయలో ఈ సరస్సు కనిపించింది. ఈ సరస్సు ప్రాంతం దాదాపు 370 చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో ఉంది. ఇది దాదాపు ఫిలడెల్ఫియా నగరం అంత పరిమాణంలో ఉంది. ఈ సరస్సులోని అవశేషాలు తూర్పు అంటార్కిటిక్ మంచు ఫలకం మొదట ప్రారంభంలో ఏర్పడిన నాటి పూర్వచరిత్రను తెలియజేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. అంటార్కిటికా మంచు గడ్డకట్టక ముందు ఎలా ఉండేదో , వాతావరణ మార్పులు ఏ విధంగా ప్రభావం చూపించాయో , భూతాపానికి ఈ మంచు ఫలకం ఎలా కరిగిపోతుందో ఇవన్నీ తెలుస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ సరస్సు “లేక్ షో ఈగిల్ ” రెండు మైళ్ల పొడవునా మంచుతో కప్పబడి ఉంది. అయితే పరిశోధకులు తమ విమానానికి మంచులో చొచ్చుకు పోయే కాంతి కిరణాలతో కూడిన రాడార్‌ను అమర్చారు. దీనివల్ల రేడియో తరంగాలు లోపలికి పంపగలిగారు. తిరిగి ఇది పరావర్తనం చెందడానికి ఎంత కాలం పడుతుందో గమనించారు. తూర్పు అంటార్కిటిక్ మంచుఫలకం మొత్తం చరిత్ర తాలూకు రికార్డు ఈ సరస్సు అని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది 34 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. అప్పటినుంచి హిమ నదీ వలయాలు మీదుగా తరతరాలుగా ఈ సరస్సు పరిణామం చెందుతూ పెరుగుతోందని ఆస్టిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన శాస్త్రవేత్త డాన్ బ్లాంకెన్‌షిప్ వెల్లడించారు. 10,000 సంవత్సరాల క్రితమే ఈ మంచుఫలకం గణనీయంగా మార్పు చెందిందని తెలిపారు. సరస్సు లోని అవశేషాల అడుగున భూగర్భ జలాలను కూడా మొట్టమొదటిసారి కనుగొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News