Sunday, August 10, 2025

ట్రాఫిక్ చక్రబంధంలో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

 వరుస సెలవులు, రాఖీ పండుగతో రోడ్లపైకి జనం

 క్రిక్కిరిసిన వాహనాలు… కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

 ఉప్పల్, హయత్‌నగర్‌ల వైపు నరకం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండ్రోజులు సెలవులు.. పైగా రాఖీ పండుగ.. దీంతో నగర ప్రజలు, జిల్లాల వాసులు ఇటు నగరానికి, అటు జిల్లాలకు పయనమయ్యారు. సొంత వాహనాలతో పాటు ప్రజారవాణా బస్సులతో అటు జాతీయ రహదారులు రాష్ట్రీయ, ప్రాంతీయ రోడ్లు వాహనాలతో కిక్కిరిసి పోయాయి. జెబిఎస్, ఎంజీబిఎస్ బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఇటు హైదరాబాద్ సిటీలోని రోడ్లలోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రం గా మారింది. కొందరు రాఖీలు, గిఫ్ట్‌లు కొనుగోలుచేసేందుకు వస్తే మరికొందరు వీకెండ్ విహారానికి, వినోదాల కోసం బయటకు రావడంతో అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీంతో నగరం ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయింది. ముఖ్యంగా నగర శివారులోని జాతీ య రహదారుల్లో హయత్‌నగర్, ఘట్కేసర్, పటాన్‌చెరు, శంషాబాద్, అప్పాకూడలి, అల్వాల్ ప్రాంతాల్లో రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి గంటకు కి.మీ.లుగా నెమ్మదిగా కదిలాయి. రాఖీ పండుగను తమతమ ఊళ్ళలో జరుపుకునేందుకు కొందరు వెళ్తే.. మరికొందరు ఊళ్ళ నుండి నగరంలోని తమ సోదరుల వద్దకు చేరకునేందుకు బయలుదేరడంతో రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.

జాతీయ రహదారులపై..
ఉప్పల్, వరంగల్ హైవేపైనా భారీగా ట్రాఫిక్ జామ్ అ యింది. ఈ ప్రాంతంలో వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. అటు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోకి భారీసంఖ్యలో ప్రయాణీకులు చేరుకున్నారు. బస్సులు, రైళ్ల కోసం వారు గంటలతరబడి ఎదురుచూశారు. కుటుంబ సమేతంగా తమ సొంతూళ్ళలో రాఖీ పండుగ జరుపుకునేందుకు భారీ గా జనం ప్రయాణమయ్యారు. అటు, హైదరాబాద్ సిటీలోని దాదాపు అన్ని బస్టాండ్ల వద్ద ప్రయాణికుల రద్దీ భారీ గా పెరిగింది. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. బస్సులు ఆలస్యంగా రావడం, స్పెషల్ బస్సుల్లో 30 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం.. ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. జేబీఎస్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌నగర్, ఉప్ప ల్, హయత్‌నగర్ బస్టాండ్లకు ప్రయాణికులు అధికంగా చేరుకోవడం, సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.

ఉదయం నుండే..
శనివారం ఉదయం నుండి శివారు ప్రాంతాల్లో రహదారులు కిక్కిరిసిపోయాయి. రహదారుల్లో కిలోమీటర్ల మేర నిలిచిపోయి. హైదరాబాద్‌విజయవాడ రహదారిపై నెమ్మదిగా వాహనాలు కదిలాయి. ఉప్పల్, అన్నోజిగూడ నుంచి ఘట్‌కేసర్ వరకు వేలాది వాహనాలు నిలిచిపోయాయి. అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ వెళ్లేందుకు 50 నిమిషాల సమయం పట్టిందని ప్రయాణికులు వెల్లడించారు. సికింద్రాబాద్‌బొల్లారం చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అల్వాల్ నుంచి బొల్లారం చెక్‌పోస్టు వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సిద్దిపేట్, కరీనంగర్, నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్ప్డింది.
హైద్రాబాద్‌లోనూ..
హైదరాబాద్ నగరంలో కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్ వరకు ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. లక్డీకాపూల్ వద్ద వాహానాలు నెమ్మదిగా కుదులుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News