మన తెలంగాణ/హైదరాబాద్: పుష్ప2 మూవీ సంధ్య థియేటర్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది. పుష్ప ఘ టనకు సంబంధించి చీఫ్ సెక్రటరీకి (సిఎ స్) షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లిడించింది. పుష్ప ఘటనలో చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు పరి హారం చెల్లించా లని ఆదేశించింది. ‘ప్రీమియర్ షోకి పోలీసుల అనుమతి లేదని రిపోర్టులో వెల్లడించారు. అనుమతి లేకుంటే నటుడు, అభిమా నులు ఎందుకొచ్చారో తెలియదు. ముందే చర్యలు తీసుకుని ఉంటే తొక్కిసలాట జరిగేది కాదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి 6 వారాల్లోపు మరో నివేదిక అందజేయాలి’ అని సిఎస్‌ను ఆదేశించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేయాలని సిపికి సూచించింది.
గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి పుష్ప-2 మూవీ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అదే సమయంలో థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడటానికి భారీగా అభిమానులు చేరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ పరిహారం అందజేసింది. గతంలో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి విదితమే. అయితే తీవ్రంగా గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ్ దాదాపు ఆరు నెలల పాటు చికిత్స పొంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కాగా, శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య అనేక అంశాలపై తీవ్రమైన చర్చలు జరగ్గా ప్రభు త్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి విదితమే. అయితే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ తీరుపై మాత్రం జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.