Sunday, April 28, 2024

కేరళ నరబలి… చంపి ముక్కలు చేసి తిన్నారా !

- Advertisement -
- Advertisement -

Human sacrifice in Kerala

తిరువనంతపురం : కేరళ నరబలి ఉదంతం .. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే ఈ కేసులో దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు (దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి… వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేసి, పాతేసి ఉంటారని అనుమానించారు. అయితే కాల్చేసిన, పాతేసిన ఆనవాళ్లు ఎక్కడా దొరక్కపోవడంతో, క్లూస్ టీమ్‌కు సైతం ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో తినేసి ఉంటారని భావిస్తున్నారు.

రెస్లీని 56 ముక్కలు, పద్మను 5 ముక్కలు చేసినట్టుగా నిందితులు (దంపతులు భగవంత్ సింగ్, లైలా.. స్నేహితుడు షఫీ) అంగీకరించారు. బహుశా తర్వాత ఆ భాగాలను తినేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఈమేరకు వాంగ్మూలం ఇవ్వగా, భగవంత్ సింగ్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఈ విషయంపై దృవీకరణ కోసం ముగ్గురు నిందితులను మరోసారి విచారించాలని భావిస్తున్నారు. తాంత్రికుడు చెప్పాడని, జూన్ 8 , సెప్టెంబర్ 26 తేదీల్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆ ఇద్దరినీ నరబలి ఇచ్చినట్టు విచారణలో తేలింది. మంగళవారం నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఎర్నాకుళం కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది.

సిఎం పినరయి విజయన్ స్పందన
ఇక భగవంత్ సింగ్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, అధికార పార్టీ మూలాలు ఉండటంతో బీజేపీ విమర్శలకు దిగింది. దీంతో ఈ ఉదంతంపై కేరళ సిఎం పినరయి విజయన్ స్పందించారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించారు. సిట్ బృందం ద్వారా విచారణ కూడా అంతే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరబలి రాకెట్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇలాంటి ఆచారాలు నాగరిక సమాజానికి సవాలుగా పరిణమిస్తాయని విజయన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News