Sunday, May 5, 2024

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…. గర్భవతిని కాల్చిన భర్త

- Advertisement -
- Advertisement -

bullet

లక్నో: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నాలుగు నెలల గర్భవతిని భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నేహా, దీపక్ సింగ్ అనే దంపతులు సార్పాథాన్ ప్రాంతంలోని భటోలి గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. లాక్‌డౌన్ విధించిన 42 రోజుల తరువాత కేంద్రం ప్రభుత్వం వైన్ షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు మద్యం కోసం బారులు తీరారు. గత నాలుగు రోజుల నుంచి మద్యం కోసం డబ్బులు కావాలని భార్యను భర్త వేధించేవాడు. సోమవారం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను బలవంతం పెట్టాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో నాటు తుపాకీతో కన్న కొడుకు ఎదుట భార్య నుదిటిపై కాల్చాడు. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. దీపక్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు గంటల్లో అతడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నేహా నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News