Tuesday, April 30, 2024

దుర్గం చెరువు అందాలు ద్విగుణీకృతం (వీడియో)

- Advertisement -
- Advertisement -

Hyderabad Durgam Cheruvu cable bridge dazzles

హైదరాబాద్: చారిత్రాత్మక దుర్గం చెరువు అందాలు ద్విగుణీకృతం అవుతున్నాయి. 1687లో ఔరంగాజేబు సేనలను ముప్పుతిప్పలు పెట్టి గోల్కొండకు నీరందించిన ఈ చెరువు భారతదేశంలోని రహస్యతటాకాల్లో ఒకటిగా చరిత్ర నమోదు చేసుకుంది. అయితే కాలగమనంలో ఆంధ్రపాలకుల నిర్లక్ష్యంతో చెరువు అందాలు అంతరించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చెరువు పునరుద్దరణకు పాటుపడింది. రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రత్యేక శ్రద్ధతో దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద తీగల వంతెనను చెరువుపై నిర్మించారు. ఈ నేపథ్యంలో అందంగా అలంకరించుకున్న దుర్గం చెరువు వీడియో చిత్రాన్ని కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్టుచేసి కమిషనర్ అరవింద్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్‌కు ట్యాగ్ చేశారు. దుర్గం చెరువు అందాలు తొంగిచూస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం బడ్జెట్‌లో 60 శాతం నిధులు మౌలికసదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నట్లు కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్టుచేశారు. తీగల వంతెనను రూపొందించిన ఇంజనీర్లను కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

Hyderabad Durgam Cheruvu cable bridge dazzles

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News