Sunday, April 28, 2024

పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Investment

 

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత ప్రభుత్వ వాణిజ్యశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ సాప్ట్ వేర్ ఎక్స్‌పర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా సాప్ట్ పేరుతో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో రెండు రోజుల సదస్సు (3,4 తేదీలు)ను మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా ఐటి కంపెనీల ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఇండియా సాప్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సదస్సు కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు నిర్వాహకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఐటి రంగంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఐటితో పాటు అనేక రంగాలకు అత్యంత అనువైన నగరం కూడా హైదరాబాద్ అని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో ఐటి రంగం మంచి పురోగతిని సాధిస్తోందన్నారు.

ఈ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ పలు రకాల ప్రోత్సాహకాలను కూడా అందిస్తోందన్నారు. కొత్తగా ఐటి రంగంలోకి వచ్చే వాళ్ళ కోసం హైదరాబాద్‌లో ఐటి హబ్‌నే ఏర్పాటు చేసి ఆ రంగాన్ని ప్రభుత్వం మరింత విస్తరింపచేస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కొత్త ఆలోచనలతో రండి… మీ కలలని అవిష్కరించండిఅనే నినాదం రాష్ట్రంలో బాగా విజయవంతం అయిందన్నారు. ఈ ఆలోచనలను తెలంగాణలోని మిగతా జిల్లా కేంద్రాలకు కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. ఐటి మంత్రి కెటిఆర్ కృషితో ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీలు తమ శాఖలను నగరంలో ఏర్పాటు చేశాయన్నారు. ఈ సదస్సుకు దాదాపు 60 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు.

దేశం నలు మూలల నుంచి కూడా ప్రతినిధులంతా హైదరాబాద్‌ని తిరిగి చూడండి…ఇక్కడి మంచి వాతావరణాన్ని పరిశీలించండి.. మీ కంపెనీలను ఇక్కడ పెట్టేందుకు ప్రయత్నించండి అని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. అలాగే హైదరాబాద్ బిర్యానికి ఉన్న అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పేరును దృష్టిలో పెట్టుకుని బిర్యానీ రుచి చూసి వెళ్ళండి అని పేర్కొన్నారు.

 

Hyderabad is Investment Centre says Errabelli
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News